Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ . 30లక్షల ఉపకార వేతనానికి ఎంపికైన హర్యానా యువతి

హర్యానాకు చెందిన పూనమ్ ధుల్(24)అనే యువతి అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలీనా' ఉపకారవేతనానికి ఎంపికయింది. పూనమ్ పీహెచ్ డీ చేయడానికి మన కరెన్సీలో షుమారు 30లక్షల రూపాయల ఉపకార వేతనాన్ని ఆ యూనివర్సిటీ నుంచి పొందనున్నారు. పూనమ్ తండ్రి హర్యానా ప్రజా సంబంధాల విభాగంలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా హర్యానా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడింపజేయాలని కోరారు. తగినంత ఆర్ధిక స్తోమత లేకపోయినా కుటుంబసభ్యుల ప్రోత్సాహమే తనను ఉత్తేజపరచిందని పూనమ్ తెలిపారు.

More Telugu News